విద్యార్థులకు సైబర్ నేరాలపై చైతన్యం – సిఐ నాగబాబు సూచనలు
EB NEWS/మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగబాబు విద్యార్థులకు సైబర్ మోసాలపై జాగ్రత్తలు వివరించారు.
లోన్ యాప్‌లు, పీఓఎస్ యంత్రాల మోసాలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్, ఏపీకే లింక్‌ల డౌన్‌లోడ్ ద్వారా జరిగే మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత బ్యాంక్ వివరాలను ఎవరికీ పంచుకోరాదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రావణ్ కుమార్ కూడా పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై సూచనలు అందించారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాలను అరికట్టవచ్చని అధికారులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి