పినపాక: వరి కోత మిషన్లతో వాహన ప్రమాదాలు



పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి రాజశేఖర్:


పినపాక మండలం సీతంపేట గ్రామంలో వరి కోత మిషన్లు రహదారిపై పొలాల నుండి నేరుగా రోడ్డు పైకి రావడంతో వాటితో పాటు  , బురద మట్టి రోడ్డు పై అంటుకుని  ద్విచక్రవాహనదారులకు ప్రమాదాలు పెరిగాయి.

ఇక్కడ మట్టి దిబ్బలు రోడ్డు మీద చేరడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల వల్ల వాహనదారులు గాయపడి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మరియు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు.


మట్టి, బురద రోడ్డు పైకి రాకుండా,  మిషన్ల ఉపయోగంలో నియంత్రణ విధించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

أحدث أقدم