ఛత్తీస్‌గఢ్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని కంచల్ (Kanchal) అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగ్ చేపడుతుండగా ఓ భారీ సొరంగంలో మావోయిస్టులు దాచిన ఆయుధాల డంప్ (Weapons Dump) లభ్యమైంది. ఆ డంప్‌లో గ్రనైడ్ లాంఛర్లు, గన్ పౌడర్, డిటోనేటర్లు, ఇన్వర్టర్లు, పేలుడు పదార్థాలు భారీ ఎత్తున లభ్యమయ్యాయి. అదేవిధంగా విస్పోటనం సృష్టించే ఆర్డీఎక్స్‌తో పాటు రైఫిల్ బయోనెట్‌లు, ఇనప రాడ్లు, కట్టర్లను కూడ స్వాధీనం చేసుకున్నారు. అయితే భద్రతా బలగాలు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆయుధాల డంప్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్దదని పోలీసు అధికారులు వెల్లడించారు.....
ఇది కూడా చదవండి...
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ కొత్త డైరెక్టర్ జనరల్‌గా చారు సిన్హా బాధ్యతలు స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి చారు సిన్హా ఈ రోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
చారు సిన్హా ఇప్పటికే ఈ శాఖలోనే ఉప సంచాలకురాలు, సంచాలకురాలు హోదాల్లో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. అలాగే కొంతకాలం పాటు ఇంచార్జి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ శాఖ పనితీరును సమర్థవంతంగా ముందుకు నడిపారు.
అనుభవజ్ఞురాలైన అధికారి అయిన చారు సిన్హా, తన దీర్ఘకాల సేవలో అనేక కీలక విభాగాలలో సేవలందించారు. విశ్వసనీయత, క్రమశిక్షణ, అవినీతిని అరికట్టాలనే కట్టుదిట్టమైన వైఖరితో ముందుకు సాగే అధికారి అని సహచరులు ప్రశంసిస్తున్నారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం చారు సిన్హా గారు మాట్లాడుతూ,
“ప్రజలకు అవినీతి రహిత పరిపాలన అందించడం, అవినీతి వ్యతిరేక పోరాటాన్ని మరింత బలోపేతం చేయడం మా ప్రధాన ధ్యేయం. అవినీతి ప్రవర్తనను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటాము” అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పారదర్శక పరిపాలనకు కట్టుబడి పనిచేసే అవినీతి నిరోధక శాఖకు, చారు సిన్హా గారి నియామకం కొత్త దిశగా మార్గనిర్దేశం చేస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు.
.jpg)

కామెంట్‌ను పోస్ట్ చేయండి