పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండల పరిధిలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొనగంటి వినయ్ ఆర్మీ ఉద్యోగానికి ఎంపికై విధులు నిర్వహిస్తూ..దసరా పండుగ సందర్భంగా తమ గ్రామానికి రావడంతో గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో యువత మాట్లాడుతూ..గ్రామాల్లోని యువకులు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలకు ఎంపిక కావడం హర్షనీయమన్నారు.యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొప్పుల లక్ష్మణ్,కొప్పుల రామనాథం,మాటూరి నరసింహారావు,పొనగంటి రాంపండు,యర్రాళ్ల నాగరాజు,తోట కృష్ణ,ప్రభాకర్,చిరు,కృష్ణ బాబు,తోట ప్రవీణ్,రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి