EB న్యూస్ , మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, విజయనగరం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,250 నగదు స్వాధీనం చేసుకుని ఒక బైక్‌ను సీజ్ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read....
పినపాక: విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేసిన తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా...
పినపాక: తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (టి ఈ ఎల్ ఎస్ ఏ) వారి ఆర్థిక సహకారంతో జడ్పీహెచ్ఎస్ పినపాక పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు క్రీడా దుస్తులను శుక్రవారం పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేయూతనందించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా సభ్యులైన మల్లికార్జున కేశవరాజు ప్రోత్సాహంతో తన బాల్య మిత్రులు అయినటువంటి కె వి రమణమూర్తి ద్వారా క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు.దాతలు అందించిన ఈ సహకారాన్ని స్వీకరించి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కొమరం నాగయ్య, పినపాక సర్పంచ్ అలివేలు, ఏఐపిసి చైర్ పర్సన్ కౌసల్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

.jpg)
కామెంట్‌ను పోస్ట్ చేయండి