పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, గోపాలరావుపేట గ్రామంలో దీపావళి సందర్భంగా మెగా వాలీ బాల్ టోర్నమెంట్ ను శుక్రవారం నాడు నిర్వాహకులు ఆరంభించారు. భద్రాద్రికొత్తగూడెం మరియు ములుగు రెండు జిల్లాల స్థాయిలో నిర్వహించే ఈ మెగా టోర్నమెంటుకు ముఖ్య అతిథిగా పినపాక మండల తహసిల్దార్ గొంది గోపాలకృష్ణ పాల్గొని రిబ్బన్ కట్ చేసి వాలీబాల్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. క్రీడలు అనేది మానసిక ఉల్లాసానికి దోహద పడుతుందన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
إرسال تعليق