- ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించాలని మున్సిపాలిటీ కమిషనర్ కు వినతి
- ఇబ్బందులకు గురవుతున్న పాదాచారులు
మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు సురక్ష బస్టాండ్ పరిధిలో ఆక్రమణదారులకు అడ్డు లేకుండా పోయింది. ఆక్రమించడానికి స్థలం లేదా అంటూ పాదాచారులు ప్రశ్నిస్తే అవమానకరమైన మాటలతో వాళ్లని హింసిస్తున్నారని సామాజిక కార్యకర్త కర్నే రవి శుక్రవారం ఆరోపించారు. ఈ విషయమై మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని సురక్ష బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రధాన రహదారిని ఆక్రమించారని తెలిపారు. రహదారిని ఆక్రమించడమే కాకుండా షాపులు నిర్మించి, ఫుట్ పాత్ మీద, వీధి వ్యాపారులుకు రెంట్ కు ఇస్తూ 3000 నుండి 5000 రూపాయలు అక్రమంగా అద్దె సంపాదిస్తున్నారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నించే పాదాచారులు, ద్విచక్ర వాహనదారులపై సైతం తిరగబడుతున్నారని, వారిపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారని రవి ఆరోపించారు. సురక్ష బస్టాండ్ దగ్గర ఉన్న ఫుట్ పాత్ పై ఆక్రమణలను ప్రధాన రహదారి పై ఇరువైపుల ఉన్న ఫుట్ పాత్ ఆక్రమణదారులు తొలగించాలన్నారు. ఈ విషయం మీద సామాజిక కార్యకర్త కర్నే రవి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి