నేడు మణుగూరుకి రానున్న ఈటీవీ జబర్దస్త్ బృందం

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మణుగూరు ఏరియా సింగరేణి కుటుంబాల మహిళలకు మరియు స్థానిక మహిళలందరికి శుభావకాశం.

సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ సోమవారం, సాయంత్రం 5 గంటలకు పి‌వి కాలనీ భద్రాద్రి స్టేడియం లో *సద్దుల బతుకమ్మ మరియు ఫ్యామిలీ డే* కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.


🌸 సద్దుల బతుకమ్మలో భాగంగా సాయంత్రం 6 గంటలకు మహిళలు, యువతులు పాల్గొనే బతుకమ్మ ఆట–పాటల పోటీలు జరుగును.

➡️ కాగితపు పూల బతుకమ్మలు అనుమతించబడవు.

➡️ సహజ సిద్ధమైన పూలతో అలంకరించిన బతుకమ్మలతో మాత్రమే రావలసిందిగా మనవి.


ఈ పోటీలలో పాల్గొన్న బతుకమ్మలను ఏరియా సేవ అధ్యక్షురాలు శ్రీమతి దుర్గం సుమతి రామచందర్  మరియు కమిటీ సభ్యులు పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు కన్సోలేషన్ బహుమతులు అందజేయబడును.


👉 అందరు మహిళామణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.


మహిళమణులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు🌸🌸



🎉 మరో ముఖ్య ప్రకటన 🎉


సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్* ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు, పి‌వి కాలనీ భద్రాద్రి స్టేడియం లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడనున్నాయి.


✨ ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణలు:


ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి డా. సీతా ప్రసాద్ బృందం నృత్య ప్రదర్శనలు.


ఈటీవీ జబర్దస్త్ బృందం – మిమిక్రీ, హాస్య వల్లరి, స్కిట్స్ మరియు డ్యాన్స్ ప్రోగ్రామ్స్.


ప్రముఖ టీవీ ఆర్టిస్టులు అందించే సినీ సంగీత విభావరి.


స్థానిక కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు.



🎇 అదేవిధంగా కనువిందు చేసే రాంలీలా – బాణాసంచా కార్యక్రమం కూడా నిర్వహించబడును.

🍴 రుచికరమైన తినుబండారాల ప్రత్యేక స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.


👉 సింగరేణి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, యూనియన్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఈ దసరా ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.


జై సింగరేణి 


📢 ఇట్లు 


సింగరేణి దసరా ఉత్సవ కార్యనిర్వాహక కమిటీ,* మణుగూరు ఏరియా.





☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


29-09-2025 ‌సోమవారం

   🌷రాశి ఫలితాలు🌷

---------------------------------------

మేషం


వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

---------------------------------------

మిధునం


సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికారంగం సాగుతాయి.

---------------------------------------

కర్కాటకం


చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారా, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

సింహం


ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

---------------------------------------

కన్య


చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

తుల


బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలస్తుంది.

---------------------------------------

వృశ్చికం


కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

---------------------------------------

ధనస్సు


నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. 

---------------------------------------

మకరం


ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఉహించిన ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు.

---------------------------------------

కుంభం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభఫలితాలు పొందుతారు.

---------------------------------------

మీనం


చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతాయి.

---------------------------------------

🍁 శుభం భూయాత్ 🍀


Post a Comment

కొత్తది పాతది