ఏటూరునాగరం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ములుగు జిల్లాలో సోమవారం గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. ఏటూరునాగరం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం 15.03 మీటర్లకు చేరుకుంది. నిన్నటి నుంచి కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరికతో పాటు, రెండవ ప్రమాద హెచ్చరిక కూడా చేరువలో ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇది కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Sep 29, 2025,
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు సోమవారం మళ్లీ పెరిగి ఆల్ టైం రికార్డుకు చేరాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.850 పెరిగి రూ.1,06,700కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.920 పెరిగి రూ.1,16,400 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.1000 పెరగడంతో రూ.1,60,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి