హైదరాబాద్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది 'శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి' అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఓ భక్తురాలికి ఖైరతాబాద్ గణపతి సాక్షిగా అద్భుతమైన అనుభవం ఎదురైంది. మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు.
ఇంతలో, ఒక గర్భిణికి ఉన్నట్టుండి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె బాధను గమనించిన ఉత్సవ కమిటీ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను పక్కనే ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరానికి తరలించారు.
వైద్యులు, నర్సుల బృందం వెంటనే ఆమెకు ప్రసవం చేయగా.. సదరి గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. ఖైరతాబాద్ గణపతి సన్నిధిలోనే తమ కుటుంబంలోకి కొత్త సభ్యుడు రావడంతో ఆ తల్లి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
ఆ గణనాథుడి రూపంలో తమకు ఒక కొడుకు జన్మించాడని.. ఇది గణపతి అనుగ్రహమని వారు సంతోషం వ్యక్తం చేశారు. సదరు గర్భిణి మహిళను రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు.
ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీ ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యార్థం పక్కా ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది, భారీగా తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని క్యూలైన్ల వద్ద పటిష్టమైన బారికేడ్లు, తాగునీటి సదుపాయం, ప్రాథమిక వైద్య సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ వైద్య కేంద్రమే గర్భిణికి సకాలంలో సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించింది. సాధారణంగా ఇలాంటి ఘటనలు పండుగ వేళలో శుభసూచకంగా భావిస్తారు. ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఇది ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఇది కూడా చదవండి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారి వినాయక చవితి శుభాకాంక్షలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు వినాయక చవితి పర్వదినం సందర్భంగా పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“విఘ్నేశ్వరుడు వినాయక స్వామి ప్రతి ఇంటి పుటపందిరిలో విరాజిల్లి, అందరికీ ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలి. కుటుంబాల్లో ఐకమత్యం పెరగాలి. భద్రాద్రి జిల్లా ప్రజల ప్రతి ఒక్కరి జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. సమాజంలో సౌభ్రాతృత్వం, సాన్నిహిత్యం, ప్రేమాభిమానాలు పెరగడానికి వినాయక చవితి పండుగ ఎంతో దోహదం చేస్తుంది. చిన్న పిల్లలు నుండి పెద్దలు వరకు అందరూ ఏకమై భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడం ఒక విశిష్టమైన ఆనవాయితీ” అని అన్నారు.
అలాగే ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ చేసుకోవడంతో పాటు పర్యావరణ హితమైన గణపతులను ప్రతిష్టించి, నీటి వనరులను కాపాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రేగా కాంతారావు గారితో పాటు ఆయన అనుచరులు, భక్తులు, జిల్లా పార్టీ నాయకులు పాల్గొని పండుగకు సంబంధించి ప్రత్యేక పూజ చేశారు.
ఇది కూడా చదవండి...
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి శోభ
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి శోభ అంబరాన్ని తాకింది. వాడవాడలా రంగురంగుల మండపాలు, భారీ గణనాథుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.
ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడంతో, మట్టి విగ్రహాలను అధికంగా ప్రతిష్ఠిస్తున్నారు. మండపాల్లో కొలువుదీరిన వినాయకులు భక్తుల సందర్శనానికి సిద్ధంగా ఉన్నారు.
భక్తి గీతాలు, ప్రత్యేక పూజలతో పండుగ వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి...
తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. వినాయక చవితి పండుగ వేళ ప్రభుత్వ ఉపాధ్యాయులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్రవ్యాప్తంగా గతంలో చేపట్టిన టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయినట్లు ప్రకటించింది. మొత్తం 4454 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు.. వారి అర్హతలకు తగ్గట్లుగా పదోన్నతులు కల్పించనున్నట్లు వెల్లడించింది. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పించినట్లు తెలిపింది.
వీరిలో స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), ఎస్జీటీలు (సెకండరీ గ్రేడ్ టీచర్లు).. హెడ్ మాస్టర్లుగా ప్రమోట్ అయినట్లు ప్రకటించింది. ఇక కొందరు ఎస్జీటీలు కూడా.. స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందినట్లు వెల్లడించింది.
ఈ 4454 మందిలో 880 మంది స్కూల్ అసిస్టెంట్స్.. హెడ్ మాస్టర్లు అయ్యారు. ఇక 811 మంది ఎస్జీటీలు కూడా హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ దక్కించుకున్నారు.
మరోవైపు.. 2763 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత.. విద్యాశాఖను ఏ మంత్రికీ కేటాయించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు.
అయితే కీలకమైన విద్యాశాఖ సీఎం వద్ద ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే తన టార్గెట్ అని ఇప్పటికే ముఖ్యమంత్రి పలుమార్లు స్పష్టం చేశారు.
వేరే మంత్రులకు విద్యాశాఖను అప్పగిస్తే.. వారి సరిగా పట్టించుకుంటారో లేదో అనే సందేహాంతో తన వద్దే ఉంచుకున్నట్లు పలు వేదికలపై తేల్చి చెప్పారు.
ఇక రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లలో పూర్తి స్థాయి హెడ్ మాస్టర్ లేకపోవడంతో.. ఆ పాఠశాలల్లో ఉండే టీచర్లే ఇంఛార్జిలుగా వ్యవహరించారు. ఇలా చేయడం వల్ల ఆ స్కూళ్లలో పలు సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లోనే ఉన్నట్లు తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు హెడ్ మాస్టర్ ఖాళీలను ప్రమోషన్ల ద్వారా రేవంత్ సర్కార్ భర్తీ చేయడంతో.. సమస్యలు తీరుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
إرسال تعليق