మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు మండల పరిధిలో ని చిక్కుడుగుంట గ్రామానికి చెందిన గుండారపు రాంబాబు, మీనాక్షి దంపతుల కుమారుడు నరసింహ వయసు 3 సంవత్సరాలు గుండెకు రంద్రం పడి అనారోగ్యంతో బాధపడుతూన్న బాబు కి ఇప్పటికే చాలా ఖర్చు పెట్టి హాస్పిటల్ కి తిప్పుతున్నారు బాబు కి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు నిరుపేద కుటుంబం చెందిన వాళ్ళు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి స్పందించిన మణుగూరు పట్టణానికి చెందిన "జనం కోసం మనం" స్వచ్చంద సంస్థ 15 వేల రూపాయలను సహాయంగా అందించారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు బండారు సురేష్, తంతరపల్లి శోభన్, కొండేరు మహేందర్, గుంటక శ్రీనివాసరెడ్డి పాల్గున్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి