ఇల్లు లేని నీరు పేదలకు ఇందిరమ్మ ఇల్లును అందించడం ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే పాయం
మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ నమూనా గృహమును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం పాయం ఇందిరమ్మ నమూనా గృహమును పరిశీలించి ప్రభుత్వ అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వీట్స్ తినిపించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లును అందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇందిరమ్మ నమూనా గృహమును ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలియజేశారు నియోజకవర్గంలో అన్ని మండలాలలో ఇందిరమ్మ ఇల్లులు ప్రారంభమై బేస్ మటమ్ దాకా పూర్తయిన ఇల్లు లబ్ధిదారులకు వారి ఖాతాలో లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమా చేసిందని లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణా పనులు పూర్తి చేసుకోవాలని నియోజకవర్గంలో పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లును అందజేసేందుకు కృషి చేస్తానని తెలియచేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమంలో మణుగూరు ఎమ్మార్వో ఇమ్మానుయేల్ , ఎంపీడీవో శ్రీనివాసరావు , MPO ,ప్రభుత్వ అధికారులు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ , టౌన్ అధ్యక్షులు శివ సైదులు , మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సౌజన్య , మణుగూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి...
కామెంట్‌ను పోస్ట్ చేయండి