అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన నాటినుండి అన్ని గ్రామాల మెయిన్ రోడ్డు కూడలి దగ్గర బస్ స్టాప్ లను రిక్వెస్ట్ బస్ స్టాప్ లను రద్దుచేసి అశ్వాపురం మండలంలోని అశ్వాపురం,మొండికుంట తప్ప మిగతా గ్రామాల బస్సు స్టాప్ లను రద్దుచేసి ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేయడం జరిగింది.ఆయా గ్రామాల ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్న తమ గ్రామాలకు తిరిగి రావాలన్న పై రెండు గ్రామాలకు వెళ్లి బస్సు ఎక్కవలసిన పరిస్థితి ఉంది. కావున ఆయా గ్రామాల ప్రయాణికుల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకొని తక్షణమే అన్ని గ్రామాల మెయిన్ రోడ్డు కూడలి దగ్గర గతం లో వున్న రిక్వెస్ట్ బస్ స్టాప్ లను పునరుద్ధరించాలని కోరుతున్నాం....కావున ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో మేనేజర్లు తక్షణమే అన్ని గ్రామాల దగ్గర బస్ స్టాప్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము.
కామెంట్‌ను పోస్ట్ చేయండి