భద్రాద్రి , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.....
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు......
ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.
గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు....
. చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో నివసిస్తున్న తోట భార్గవి w/o వేణుగోపాల్ తమకు సర్వేనెంబర్ 114/4/3/2 నందు 0.38 గుంటల పొలం తన తల్లి గారి నుండి సంక్రమించినదని, సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం కూడా ఉన్నదని, అయినప్పటికీ తన యొక్క సోదరులు పొలం సాగు చేసుకునేకుండా అడ్డుపడుతున్నారని కావున తగున చర్యలు తీసుకోవాల్సిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం శండ్రుగొండ తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు..
* పినపాక నియోజకవర్గం, కరకగూడెం మండల పరిధిలోని చోప్పాలా మరియు నర్సాపురం గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని కావున చోప్పాల నుండి నరసాపురం వరకు మరియు నరసాపురం నుండి ఎస్సీ కాలనీ పెద్దవాగు వరకు బీటీ రోడ్డు నిర్మించాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పంచాయతీరాజ్ ఈ ఈ కి ఎండార్స్ చేయడం జరిగింది.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన నోముల లక్ష్మి w/o బుచ్చయ్య మాది నిరుపేద కుటుంబమని 2024 సంవత్సరంలో సంభవించిన గోదావరి భారీ వరదల కారణంగా మా ఇంటి నిర్మాణం పూర్తిగా కొట్టుకపోయినదని ప్రభుత్వం వారు నష్టపరిహారం కూడా అందించినారని అప్పటినుండి తాత్కాలికంగా రేకుల షెడ్డు వేసుకొని జీవనం సాగిస్తున్నామని మళ్లీ వరదలు వచ్చినప్పుడు ఆ గుడిసె కూడా పూర్తిగా కొట్టుకుపోయి నిరాశ్రయులైనమని మా కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుతూ చేసిన దరఖాస్తు ని పరిశీలించి తగు చర్యల నిమిత్తం అశ్వాపురం ఎంపీడీవో కి ఎండార్స్ చేశారు...
. లక్ష్మీదేవి పల్లి మండలం బోరింగ్ తండా గ్రామంలో నివసిస్తున్న నునావత్ జగన్ మోహన్ దాస్ s/o హరి సింగ్ తాను కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నానని, రోడ్డు విస్తరణలో భాగంగా తన యొక్క కిరాణా దుకాణం పూర్తిగా కోల్పోతున్నానని, తన జీవన ఆధారం కోల్పోతున్నానని కావున తనకు తగిన న్యాయం చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం అదనపు కలెక్టర్ కు ఎండార్స్ చేశారు.
* బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్ గ్రామపంచాయతీకి చెందిన జివాజి రమాదేవి గత 20 సంవత్సరాలుగా మొరంపల్లి బంజర గ్రామపంచాయతీలో నివసిస్తున్నానని తనకు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నానని మూడు సెంట్లు కొంత ఖాళీ స్థలం ఉన్నదని ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు అర్హుల జాబితాలో నా పేరు ఉందని కానీ మూడో విడతలో ఇల్లు మంజూరు చేస్తామని అంటున్నారని ఎంక్వయిరీ చేసి రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం బూర్గంపాడు ఎంపీడీవోకు ఎండార్స్ చేశారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యా చందన,వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు....
కామెంట్‌ను పోస్ట్ చేయండి