మణుగూరు ప్రభుత్వ ఐటీఐ లో అప్రెంటిస్ మేళా



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీఐ పూర్తి చేసిన యువత కోసం సోమవారం (మే 12) మణుగూరు ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ఇంచార్జి ప్రిన్సిపాల్ జి. రవి తెలిపారు.


 హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.


 అప్రెంటిస్ మేళా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించే వీలుందని, ఇప్పటికీ అప్రెంటిస్ అవకాశాన్ని వినియోగించుకోని అభ్యర్థులు ఈ అవకాశంను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ యువతి, యువకులకు ఆయన ఆహ్వానం తెలిపారు.



ప్రతి రౌండ్లోనూ పాక్ ఓడిపోయింది: ప్రధాని


త్రివిధ దళాల అధిపతులతో జరిగిన భేటీలో పాకిస్థాన్తో యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.


 భారత ఆర్మీ చేసిన దాడులతో పాక్ పూర్తిగా ధ్వంసమైందని పేర్కొన్నారు.


 మనం చేసిన యుద్ధంలో ప్రతి రౌండ్లోనూ పాక్ ఓడిపోయిందని తెలిపారు. 


పాక్ ఎయిర్బస్లపై మనం చేసిన దాడులతో వాళ్లు అసలు యుద్ధంలోనే లేరనే విషయం అర్థమైందన్నారు. 


అటు ఆపరేషన్ సింధూర్ ముగియలేదని పేర్కొన్నారు.



Post a Comment

కొత్తది పాతది