రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు అందజేసిన వెంటనే భూ సమస్యలు పరిష్కారం చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పైలట్‌ ప్రాజెక్టుగా సుజాతానగర్ మండలం ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుజాతానగర్ మండలంలోని సర్వరం, కోయగూడెం గ్రామాల్లో భూ భారతిలో భూ సమస్యలపై రైతులు ఇచ్చిన దరఖాస్తులను కలెక్టర్‌ పరిశీలించారు.


అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ రెవెన్యూ సదస్సులో భూ రికార్డులలో పేర్లు తప్పులు, భూమి విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్‌ మిస్సింగ్‌, పట్టా పాస్‌ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్‌-బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి భూ భారతి కొత్త ఆర్‌.ఓ.ఆర్‌ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతారన్నారు. అలాగే నిర్దేశిత గడువు లోపు భూములు పరిష్కరిస్తారన్నారు.మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పూర్తయ్యాక జిల్లాలోని అన్ని మండలాల్లో జూన్‌ మొదటి వారంలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తహసీల్ధార్‌ను అదేశాంచారు.


 ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్డీవో మధు, సుజాతనగర్ తాసిల్దార్ శిరీష మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి...

ఉరి వేసుకుని వ్యక్తి హత్మహత్య

Post a Comment

కొత్తది పాతది