ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సేకరణలో ఎవరైనా వారి యొక్క విధులు పట్ల నిర్లక్ష్యం ఇస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ టి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చండ్రుగొండ మరియు పాల్వంచ మండలాల్లో ధాన్యం సేకరణలో వచ్చిన ఫిర్యాదులు పై విచారణ జరిపి పాల్వంచ మండలం సోమల గూడెం మరియు చంద్రుగొండ మండలం తుంగారం (PACS) ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జిలను సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. ధాన్యం సేకరణలో ఎటువంటి నిర్లక్ష్యం లేదా పొరపాట్లు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కూడా చర్యలు చేపడతామన్నారు.
ఇది కూడా చదవండి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి