కలెక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని




 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యంతోపాటు ప్రసూతి చేయించుకోవడం అభినందనీయం


👉ప్రభుత్వ ఆరోగ్య విధానాలపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ దంపతుల నిర్ణయం.


👉కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్య సేవలందిస్తున్న నియోజకవర్గ ప్రభుత్వ ఆస్పత్రులు.


👉సకల సౌకర్యాలతో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం.


👉నవజాత శిశువుకు దీవెనలు అందించిన కూనంనేని.


పాల్వంచ: పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి(CHC) నందు కానుపు చేయించుకున జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, సతీమణి శ్రద్ధ జితేష్ వి పాటిల్ దంపతులకు కొత్తగూడెం శాసనసభ సభ్యులు బుధవారం ఒక్క ప్రకటనలో శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా జిల్లా కలెక్టర్ దంపతులు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యంతో పాటు ప్రసూతి చేయించుకోవటం అభినందనీయమని అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి, సకల సౌకర్యాలు అందించడానికి తీవ్ర కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాల్వంచ CHCలో నేడు కలెక్టర్ సతీమణి ప్రసూతి తో పాటు గతంలో మోకాలు శాస్త్ర చికిత్స, కవలల గర్భిణీకి నార్మల్ డెలివరీ లాంటి అనేక అరుదైన వైద్య సేవలు అందిస్తున్న పాల్వంచ ఆస్పత్రి సూపర్డెండెంట్, RMO, డాక్టర్లు, వైద్య సిబ్బందిని, నిత్యం విద్యా విధాన పరిషత్ ఆసుపత్రులను పర్యవేక్షిస్తూ, సమన్వయం చేస్తూ డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వైద్యులు వైద్య సిబ్బంది మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ మరిన్ని మెరుగైన సేవలను పేదలకు అందించాలని సూచించారు. కలెక్టర్ దంపతుల నవజాత శిశువుకు దీవెనలు అందించారు.

Post a Comment

أحدث أقدم