TG: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అప్పు అప్పు పుట్టడం లేదని, అన్నా పైసా ఎవరు ఇవ్వడం లేదు, ఎవరినైనా కలవడానికి వెళితే తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధులను బ్యాంకర్లు దొంగల్ని చూసినట్లు చూస్తున్నారని అన్నారు. ఢిల్లీకి వెళితే ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, వీళ్ళు వస్తే చెప్పులు కూడా ఇస్తే ఎత్తుకుపోతారేమో అని భయపడుతున్నారన్నారు. ఆ పరిస్థితి ఉంది దేశం ముందు అని చెప్పుకొచ్చారు. అప్పు పుడితే ఏదో ఒకటి చేసే వాడిని అని అన్నారు. అప్పు పుట్టలేదు, ఎవ్వరు బజార్ల నమ్మట్లేదు అన్నారు. స్వీయ నియంత్రణే దీనికి పరిష్కారం అన్నారు. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్ల ఎవరైనా నమ్ముతారు అని చెప్పుకొచ్చారు. వీదికెక్కి రచ్చ చేస్తే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లా ఉంటదో ఉద్యోగ సంఘ నాయకుల్లారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబమని, ఈ రాష్ట్ర పరువు బజార్లో పడేస్తే... వద్దు అని కుటుంబ పెద్దగా నేను విజ్ఞప్తిని చేస్తున్నానన్నారు.
Also Read... ఇదెక్కడి విడ్డూరం... భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కొని తిన్నాడు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి