అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
అశ్వాపురం మండలం సీఐ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఎస్సై తిరుపతి రావు ఆధ్వర్యంలో సీతారామ కెనాల్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 41 పశువులను పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... ఎవరైనా మూగ జీవులైన పశువులను అక్రమంగా తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి