ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు,ఎంపీ బలరాం నాయక్ గారు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు
*👉కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పి కొడతాం..*
*👉పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం..*
*👉ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం..*
తేదీ : 11/04/2025
కరకగూడెం మండలం
=======================
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఏఐసీసీ, టిపిసిసి పిలుపు మేరకు అగ్రనేత రాహుల్ గాంధీ గారు చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ..పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
➡️భారతదేశ రాజ్యాంగం మరియు అంబేద్కర్ గారి విలువలు సామాజిక సమానత్వం న్యాయం మరియు హక్కులపై ప్రజల్లో అవగాహన పెంచడం,మహాత్మా గాంధీ గారి వారసత్వం, రాజ్యాంగం పట్ల గౌరవాన్ని ప్రజల హక్కుల పరిరక్షణను గుర్తుచేయడమే ప్రధాన లక్ష్యంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు..
➡️ అంబేద్కర్ గారిని నిండు పార్లమెంట్లో అమిత్ షా అహంకారపూరిత వాక్యాలకి క్షమాపణ చెప్పాలని ఓటు హక్కు కల్పించి సమానత్వాన్ని కల్పించిన అంబేద్కర్ మాకు స్ఫూర్తిదాయకమని ప్రజాస్వామ్యం పై ఏమాత్రం నమ్మకం లేని బిజెపికి పరిపాలించే నైతిక అర్హత లేదు అని, జై బాపు జై భీమ్ జై సంవిధన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలియజేసారు..
➡️అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమన్నారు..
➡️రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు *రేవంత్ రెడ్డి* గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో
ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గారు, చంద సంతోష్ గారు,కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు, నియోజకవర్గ మహిళా నాయకురాలు పోలేబోయిన శ్రీవాణితిరుపతయ్య గారు, మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి