మహా అన్నప్రసాద కార్యక్రమానికి ఎన్నారై స్టూడెంట్ ఇల్ల నవీన్ రూ. 30 వేల ఆర్థిక వితరణ

 


_ నవీన్ దైవభక్తిని అభినందించిన గ్రామ పెద్దలు


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, గోపాలరావుపేట గ్రామానికి చెందిన ప్రవాస భారతీయ విద్యార్థి ఇల్ల.నవీన్ శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని నిర్వహించే మహాఅన్న ప్రసాద కార్యక్రమానికి ముప్పై వేల రూపాయల ఆర్థిక వితరణ అందజేశారు .ఈ సందర్భంగా నవీన్ దైవ భక్తిని గ్రామ పెద్దలు కొనియాడారు. ఈ మొత్తాన్ని గోపాలరావుపేట శ్రీ సీతారాముల ఆలయ కమిటీకి ఇల్ల నవీన్ మేనమామ కన్నె రమేష్ శనివారం గోపాలరావుపేటలోని శ్రీ సీతారామచంద్ర ఆలయంలో కమిటీకి అందజేశారు. దేవుడి కార్యక్రమానికి సహకరించిన భారతీయ విద్యార్థి నవీన్ కు, నవీన్ కుటుంబానికి శ్రీ సీతారామచంద్ర వారి ఆశీర్వాదం మెండుగా ఉండాలని ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుటుంబ సభ్యులు, సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.









Post a Comment

أحدث أقدم