ఉగ్రదాడి దేశవ్యాప్తంగా నిరసనలు

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:





జమ్మూ కాశ్మీర్ పహల్గం లో బైసారీన్ ర్యాలీలో నిన్న మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్న సమయంలో...


 ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుసుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.


పర్యాటకులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ఘటనలో దాదాపు 30 మంది మరణించారు. కొంతమందికి గాయాలయ్యాయి.


మృతుల్లో 26 ఏళ్ల నేవీ ఆఫీసర్ ఉన్నారు. అతడిది ఈనెల 16న వివాహం అయితే... సెలవుల్లో ఇలా వచ్చి మృత్యువాత పడ్డారు.


జమ్మూ కాశ్మీర్ పహల్గం దాడి పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.


జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ద్రౌపదిమూర్మం  ఖండించారు. ఈ ఘటన చాలా బాధ కలిగించే ఆమె ఒక ప్ప్రకటనలో పేర్కొన్నారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి తెలిసిన వెంటనే.. సౌదీ పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. నేడు సాయంత్రం ఐదు గంటలకు మోడీ ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం  నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదాన్ని రూపురేఖలు లేకుండా చేసేందుకు దిశా నిర్దేశం చేయనున్నారు.


జమ్ము కాశ్మీర్ పహాల్గంలోని నిన్న జరిగిన ఉగ్ర దాడిలో విశాఖ వాసి ఉన్నట్లు గుర్తించారు. అతను రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి.

 నిన్న జరిగిన ఉగ్రదాడికి పలువురు సినీ ప్రముఖులు, క్రికెటర్లు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


#WeWantRevange...J&K ఉగ్రదాడి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.


సోషల్ మీడియాలో #WeWantRevange అంటూ దీనికి ప్రతి కారం తీర్చుకోవాలని నీటిజెన్లు అంటున్నారు. 


ఉగ్రవాడి నిరసనగా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. కొన్ని ప్రాంతాల్లో మృతులకు నివాళిగా క్యాండీలైట్లతో నిరసన తెలిపారు.


ఇది కూడా చదవండి.సాక్షాత్ కలెక్టర్ నోట ఏసీబీ అధికారుల మాట..కంగు తిన్న రెవిన్యూ సిబ్బంది...

Post a Comment

أحدث أقدم