ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
సాక్షాత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ నోట ఏసీబీ అధికారుల మాట రావడంతో అశ్వాపురం రెవిన్యూ సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు.. ఈ సంఘటన సోమవారం అశ్వాపురం లో జరిగిన భూభారతి రెవెన్యూ కొత్త చట్టం పై నిర్వహించిన అవగాహన సదస్సులో చోటుచేసుకుంది ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు అశ్వాపురం తాసిల్దార్ స్వర్ణ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. కొత్త చట్టానికి సంబంధించి జిల్లా కలెక్టర్ రైతులకు వివరిస్తుండగా.. ఆనందపురం గ్రామానికి చెందిన ఓ రైతు తనకు వారసత్వం కింద రావలసిన భూమిని రికార్డుల్లో ఎక్కించడం లేదని ఎక్కించాలంటే స్థానిక రెవిన్యూ సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాడు దీనికి స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి అట్టి అధికారులను పట్టించండి అంటూ ఆ రైతుకు చెప్పారు లేదంటే నాకు చెప్పండి నేను ఏసీబీ అధికారులను పంపిస్తాను అన్నారు జిల్లా కలెక్టర్ నోట ఈ మాట రావ..డంతో రెవిన్యూ సిబ్బంది ఒక్కసారిగా కంగుదిని నీళ్లు నమిలారు.. కలెక్టర్ మాటలతో అవగాహన సదస్సు హాజరైన రైతులు ఒక్కసారిగా ఆనందం వెల్లువిరిసింది.. మునుముందు అశ్వాపురం తాసిల్దార్ కార్యాలయం పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే...!!
ఇది కూడా చదవండి...సాయి ప్రకాష్ మిస్సింగ్..... చివరికి బావిలో శవం..?
కామెంట్‌ను పోస్ట్ చేయండి