పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు- గొడిశాల రామనాథం




 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ పినపాక

 గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా పార్టీ కట్టుబాటుకి అనుసంధానంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ నేటి వరకు పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉంటున్నానని గొడిశాల రామనాథం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు కావాలని పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ వాట్సప్ గ్రూపులో పోస్టులు చేస్తున్నారు... నా వ్యక్తిగత అభిప్రాయం లేకుండా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. పార్టీని గానీ నియోజకవర్గ ఎమ్మెల్యేని గాని విమర్శిస్తే... అటువంటి వారిపై పార్టీ క్రమశిక్షణ నిబంధనల ప్రకారం పార్టీ నుండి తొలగించడం జరుగుతుందని తెలిపారు.



Post a Comment

أحدث أقدم