ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లా లో జనవరి లో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షలో పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విద్యార్థి సాలేంద్ర ప్రీతమ్ యాదవ్ 6వ తరగతి కి నవోదయ ప్రవేశ పరీక్షలో సీటు సాధించడం జరిగిందని ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎండి యూసఫ్ షరీఫ్ తెలిపారు. సీటు సాధించినందుకు విద్యార్ధిని పాఠశాల యాజమాన్యం , ఉపాధ్యాయులు అభినందిస్తూ సత్కరించారు. ఎక్సలెంట్ విద్యాసంస్థల చైర్మన్ ఎండి యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించారని విద్యార్థి మరింత గా కృషి చేసి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్ధిని సత్కరించారు. విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల
యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎండి యూసఫ్ షరీఫ్, కరస్పాండెంట్ ఎండి ఖాదర్, డైరెక్టర్లు ఎండి యాకుబ్ షరీఫ్, ముక్కు నర్సారెడ్డి , బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ అంకం సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Congratulations team
ردحذفإرسال تعليق