ఇకపై లైసెన్సులు రద్దు : పొన్నం ప్రభాకర్

 



 ఎన్ కౌంటర్  బులెట్ న్యూస్: తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకనుండి కఠిన చర్యలు తీసుకోకున్నట్టు పేర్కొన్నారు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఆ తర్వాత వాటిని ఇన్నటికీ పునరుద్ధరించమని, వారు తరువాత ఏవైనా వాహనాలు తీసుకుంటే వాటికి రిజిస్ట్రేషన్లు చేయమని హెచ్చరించారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిబంధనను అమలులోకి తీసుకు వస్తుందని, ఇందుకు సంబంధించి జీవో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. మంత్రి పేర్కొన్న ఈ నిర్ణయంతో నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వహించే వారికి భారీ షాక్ తగలనుంది. ఎనిసార్లు జరిమానాలు విధించినా కొందరు తీరు మార్చుకోవడం లేదని, అలాంటి వారిపట్ల ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు.












Post a Comment

أحدث أقدم