పినపాక: అగ్ని ప్రమాదం... పూరిల్లు దగ్ధం

 


 పినపాక /ఎన్ కౌంటర్  బులెట్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట గ్రామంలో గుమ్మల బాబు అనే వ్యక్తి ఇంటికి  అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పూరి ఇల్లుకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయాగా.. ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకుంది.  ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఈనెల 14 తారీకు రాత్రి ఇదే గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస అగ్ని ప్రమాదాలు జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పాలి.


Post a Comment

أحدث أقدم