ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంకు నందు బుధవారం ఓ ప్రయాణికుడు బాటిల్ లో పెట్రోల్ కొట్టించుకోగా.. పెట్రోల్ పైకి తేలి కింద నీళ్లు కనిపించాయి. దీంతో వాహనదారుడు బంకు యాజమాన్యంతో గొడవకు దిగారు. నీళ్లు కలిసిన పెట్రోల్ వాహనాల్లో పోయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ వారు ప్రతీరోజు నాణ్యతను చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ఎలాంటి నాణ్యత చెకింగ్ చూడట్లేదని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాలి. హెచ్పి బంకు ఇంత యదేచ్చగా నీళ్లు కలిసిన పెట్రోల్ అమ్ముకుతుంటే సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని పలువురు వాహనదారులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా ఒక పెట్రోల్ బంక్ లైసెన్స్ పొందాలంటే పది రకాల నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలతోని మాకేంటి పని అన్నట్టు హెచ్ పి పెట్రోల్ బంకు యాజమాన్యం వ్యవహరిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి పెట్రోల్ బంకులు నియమ నిబంధనలతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.
إرسال تعليق