అక్రమ ఇసుక రవాణాను సమర్థవంతంగా అరికట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు అధికారులందరూ సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు చేపడుతున్న చర్యలలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ భద్రాచలం మరియు నాగారం(పాల్వంచ) వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టులతో పాటు చర్ల మండలంలోని మొగళ్లపల్లి,వీరాపురం,చింతకుంట ఇసుక ర్యాంపులను సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడ విధులలో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు.ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే అట్టి వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.ప్రస్తుతం ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ర్యాంపుల నుండి ఇసుక తరలించే విధానాన్ని పరిశీలించారు.

Post a Comment

أحدث أقدم