ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి ఇద్దరు గిరిజనులను హత్య చేశారు. కరమ్ రాజు, మద్వి మున్నాను గొంతుకోసి చంపారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలోని టార్రెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అలాగే, బీజాపూర్- దంతేవాడ సరిహద్దు ప్రాంతంలో మందుపాతర పేలి ముగ్గురు జావాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి