ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాది కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర మహోత్సవంలో మంత్రి ధనసరి సీతక్క, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు. వారు సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేసిన ఆలయ కమిటీ వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చందా లింగయ్య దొర, కరకగూడెం మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పినపాక నియోజకవర్గం టిపిసిసి అధ్యక్షులు డా చందా సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Big Breaking News
కామెంట్‌ను పోస్ట్ చేయండి