కరకగూడెం: సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాది కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర మహోత్సవంలో మంత్రి ధనసరి సీతక్క, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు.   వారు సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేసిన ఆలయ కమిటీ వారికి ఎలాంటి  అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  నిర్వాహకులు చందా లింగయ్య దొర, కరకగూడెం మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పినపాక నియోజకవర్గం టిపిసిసి అధ్యక్షులు డా చందా సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Big Breaking News

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ 19 మంది మావోయిస్టుల లొంగుబాటు

Post a Comment

أحدث أقدم