సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన- హెడ్ కానిస్టేబుల్ మల్సూర్

పినపాక ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:

 

పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రాజ్ కుమార్ ఆదేశాల మేరకు.. హెడ్ కానిస్టేబుల్ మల్సూరు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మల్సూర్ మాట్లాడుతూ.. ఆన్లైన్లో నగదు లావాదేవీలు ఎక్కువైనందున సైబర్ నేరాలు ఎక్కువ అయ్యాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సోషల్ మీడియా యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో వీడియోలు చూసి ఉచితంగా నగదు వస్తుందని ఆశపడి మోసపోకూడదు అన్నారు. తెలియని నెంబర్లనుంచి ఫోన్ వస్తే ఎలాంటి ఓటీపీలు చెప్పకూడదని తెలిపారు. వాట్సాప్ లో వెబ్సైట్ లింకులు గుడ్డిగా ఓపెన్ చేయరాదన్నారు. ముఖ్యంగా పండుగలు వస్తున్నందున ఆన్లైన్లో షాపింగ్ చేసేవాలు అఫీషియల్ వెబ్సైట్లోనే వస్తువులు కొనుగోలు చేస్తే మంచిదన్నారు. ఎవరూ కూడా సైబర్ నేరగాల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم