ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: తెలంగాణలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రకరకాల పథకాలు అమలు చేస్తోన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మరో వినూత్న పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే తమ లక్ష్యమని పదే పదే చెప్తున్న ప్రభుత్వం.. మహిళలంతా తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న ఆలోచనతో అందరికీ ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా.. మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు.. ఉచితంగా కుట్టు మిషన్లను అందించనున్నారు. అర్హులైన వారు నేరుగా ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఉచిత కుట్టుమిషన్ల కోసం అప్లై చేసుకునేందుకు ముందుగా https://tgobmms.cgg.gov.in సైట్‌ను సందర్శించాలి. సైట్ ఓపెన్ కాగానే Apply Online for availing the Sewing Machines under "Indiramma Mahila Shakti" scheme 2024-25) అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే నేరుగా దరఖాస్తు ఫామ్ ఓపెనవుతుంది. ఇందులో అప్లై చేసుకునే మహిళ తన వ్యక్తిగత వివరాలు.. అడ్రెస్, ఎటాచ్‌మెంట్స్ విభాగాలను నింపాలి.
ఈ ఫామ్‌లో పేరు, రేషన్ కార్డు నంబర్‌తో పాటు తండ్రి లేదా భర్త పేరు, సంవత్సర ఆదాయం, పెళ్లి వివరాలు, మొబైల్ నెంబర్, మతం, టైలరింగ్ ట్రైనింగ్ వివరాలు, ఆధార్ నంబర్, పుట్టిన రోజు, జెండర్, చదువు వివరాలు నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడ్రెస్ వివరాలు కూడా పూర్తిగా నింపాలి. ఆ కిందే ఒక ఫొటోగ్రాఫ్, కుల ధ్రువీకరణ పత్రం, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.
إرسال تعليق