ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. పినపాక గ్రామసభ రచ్చ రచ్చ (వీడియో)

 ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్: పినపాక




 పినపాక మండలం జానంపేట గ్రామంలో ఈరోజు నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది.


 ప్రజాపాలనలో 4 పథకాల అర్హుల జాబితాలో భాగంగా రేషన్ కార్డుల జాబిత, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల పేర్లు పూర్తిగా వెల్లడించడం జరిగింది. కానీ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో లబ్ధిదారుల పేర్లు కాకుండా అర్హుల జాబితా అని 450 పేర్లను చదివి గ్రామ సభకు వచ్చిన ప్రజలను తప్పు దోవ పడుతుందని.. అధికారులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామ సభకు వచ్చిన ప్రజలు ఎందుకు వచ్చామా అని మధ్యలోనే కొంతమంది వెను తిరగడం జరిగింది. అధికారులకు ప్రజలకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గ్రామ సభకు హాజరైన BRS పార్టీ నాయకులు పూర్తిగా నిరుపేదలైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల అర్హులుగా ప్రకటించాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లో కూడా అర్హులైన పేర్లను జాబితాలో చేర్చాలని అధికారులకు తెలియపరచడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రజల పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులైన ముదునూరి రవిశంకర్ వర్మ, పొనుగోటి కామేశ్వరరావు, పొనుగోటి భద్రయ్య, గుండం దామోదర్, గాండ్ల అశోక్, జీ లక్ష్మయ్య, సిరిండి ఆంజనేయులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

أحدث أقدم