* ఘనంగా ఎక్సలెంట్ భాష హై స్కూల్ లో ముందస్తు సంక్రాంతి వేడుకలు*
పినపాక,జనవరి 11 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
పినపాక మండలం లోని బయ్యారం క్రాస్ రోడ్లోని ఎక్సలెంట్ భాష హై స్కూల్ లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పచ్చని మామిడాకు తోరణాలు... బంతి చామంతుల గూభలింపులు , రంగు రంగుల ముగ్గులు, ముగ్గుల్లో గొబ్బిళ్లు, కొత్త బియ్యం కలపోతలు , సాంప్రదాయానికి అద్దం పట్టే వస్త్రధారణ లో పిల్లలు.. ఇదంత ఎక్కడో అనుకుంటే పొరపాటే ఎంతో ప్రతిష్టాత్మకంగా గత దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న ఎక్సలెంట్ భాష హై స్కూల్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా విద్యార్థినీలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా విద్యార్థులు రంగు రంగుల కలర్స్ తో చక్కని కళాత్మకమైన ముగ్గులు వేసి అలరించి,సంబరాలు జరుపుకున్నారు.సంక్రాంతి పండుగ, ముత్యాల ముగ్గుల , గంగిరెద్దుల సందళ్లు , భోగి పండుగ ప్రాముఖ్యత గురించి ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ యూసఫ్ షరీఫ్ విద్యార్థులకు తెలియజేశారు.ముగ్గుల పోటీలో గెలుపొందిన విద్యార్థినీలకు ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ ఎండి ఖాదర్, ఎండి యూసఫ్ షరీఫ్, డైరెక్టర్స్ ఎండి యాకూబ్ షరీఫ్, నర్సారెడ్డి, బండారు బండారు నరేంద్ర , ప్రిన్సిపాల్ అంకం సురేష్, సీనియర్ ఉపాధ్యాయురాలు వలసల మోహన్, ఉపాధ్యాయ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు...
