ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ చైనా మాంజా దారంతో గాలిపటాలు ఎగిరేకూడదని ఒక ప్రకటనలో తెలిపారు. మాంజదారంతో గాలిపటాలు ఎగురవేయడం వల్ల వాహనదారులకు తట్టుకొని ప్రమాదార బారిన పడుతున్నారన్నారు. ఎవరు కూడా మాంజా దారం కొనకూడదని ఈ సందర్భంగా తెలిపారు. మాంజా దారం వల్ల పలు ప్రాంతాల్లో వాహనదారులు మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. ఇంతటి ప్రమాదాలు జరుగుతున్నందున తప్పక జాగ్రత్త పాటించాలని ఎస్ఐ రాజ్ కుమార్ సూచించారు. మాంజా దారం వాడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి