భద్రాద్రిలో"ప్లాస్టిక్ ఫ్రీ ఛాలెంజ్ " ప్రారంభం.

encounterbulletnews
By -
0

 ఎన్ కౌంటర్ బులేట్ న్యూస్:


 జే.డీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్లాస్టిక్ ఫ్రీ ఛాలెంజ్ సెల్ఫీ స్టాండ్ ని ప్రారంభించిన ఈవో రమాదేవి  

2018 నుంచి భద్రాచలం పట్టణంలో మరియు దేవస్థానం పరిసర ప్రాంతాల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తున్న జే.డీ ఫౌండేషన్ ని అభినందించారు, భద్రాద్రి దేవస్థానం ఈవో రమాదేవి.ఈ మేరకు ముక్కోటి సందర్భంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వారి సహకారంతో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నిషేధం చాలెంజ్ అనే సెల్ఫీ పాయింట్ ని దేవస్థానం ప్రాంగణంలో ఈ.వో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధానికి దేవస్థానం కూడా సహకరిస్తుందని ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా విన్నూత్న పద్ధతిలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన ఆకట్టుకుందని తెలిపారు. దేవస్థానం గోశాల వద్ద ఏర్పాటు చేసిన ఈ సెల్ఫీస్టాండ్ ని పలువురు భక్తులు, ప్రజలు అధికారులు సెల్ఫీలు తీసుకుని ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా జెడి ఫౌండేషన్ కన్వీనర్ మురళీమోహన్ ఈవో, అధికారులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కో ఆర్డినేటర్ హన్సి, కడాలి నాగరాజు, యూసఫ్ మియా, అంబికా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)