పినపాక ,కరకగూడెం మండలాలలో జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీ

encounterbulletnews
By -
0

పినపాక /  కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి గురువారం పినపాక కరకగూడెం మండలాల్లో పర్యటించారు. పినపాక జిల్లా పరిషత్ హై స్కూల్ లో రెండు మండలాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి AAPAR ఐడి ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా FLN, FRS, UDISE+, మధ్యాహ్న భోజనం ఆన్లైన్ నమోదు తదితర ఆన్లైన్ పనులు ఎప్పటికప్పుడు సకాలంలో నమోదు చేయాలన్నారు. AMO నాగరాజు శేఖర్ విద్యాబోధనలో మెలకువలను వివరించారు. జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ N సతీష్ కుమార్ AAPAR ఐడి ఆన్లైన్లో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం డీఈవో కరకగూడెం కేజీబీవీని సందర్శించారు. పినపాక మండలానికి మంజూరైన నవోదయ పాఠశాల తాత్కాలిక వసతిని కరకగూడెం కేజీబీవీలో ఏర్పాటు చేసేందుకు సౌకర్యాలను పరిశీలించారు. పినపాక కేజీబీవీని తనిఖీ చేసిన ఆయన బాలికల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పినపాక, కరకగూడెం మండల విద్యాశాఖ అధికారులు కే నాగయ్య, మంజుల పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)