*పినపాక సత్యమేవ జయతే నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక*
*నూతన అధ్యక్షులు: నిట్టా వెంకటేశ్వర్లు( ప్రజాదర్బార్)*
*ఉపాధ్యక్షులు: అoడెం యాకన్న( పీపుల్స్ డైరీ)*
*ప్రధాన కార్యదర్శి: గుడికందుల రాజశేఖర్ ( నిర్భయ వార్త)* ను
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
నూతన కార్యవర్గాన్ని 16 మంది సభ్యులు ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం వివేకానంద ఇన్స్టిట్యూట్ నందు సత్యమేవ జయతే నూతన ప్రెస్ క్లబ్ ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షులు నిట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ముందుంటానని తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తనని సంప్రదించాలన్నారు. ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తీర్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. పినపాక సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ ను ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా కొంపెల్లి సంతోష్, గౌరవ సలహాదారుడిగా బోడ లక్ష్మణ్ రావు, ట్రెజరర్ గా గుమాస్ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా గాడూదల దిలీప్, క్రీడా విభాగం కోటి, సభ్యులు గోడిశాల చంద్రం, దొడ్డ శ్రీనివాస్, కొంపెల్లి మల్లేష్, కొంపెల్లి నాగేష్, తోకల శంకర్, వీరముష్టి ఉదయ్ కుమార్, గుమాస లక్ష్మణ్ ఎన్నుకోవడం జరిగింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి