కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి: సిపిఎం నాయకుడు నిమ్మల వెంకన్న
పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు అవమానకరమని, వెంటనే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్య లను ఖండిస్తూ సోమవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ అంబేద్కర్ను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. మతం పేరుతో రాజకీయం చేస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాద విధానాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, కమిటీ సభ్యులు మడివి రమేష్, నట్టి శంకరయ్య, మడివి జోగయ్య, పాయం శంకర్, బాడిషా నరసయ్య, గడి గల వెంకన్న సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
إرسال تعليق