లొంగిపోయిన మావోయిస్టులకు చెక్కుల రూపం లో రివార్డు నగదు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

 లొంగిపోయిన మావోయిస్టులకు చెక్కుల రూపంలో రివార్డు నగదు 

లొంగిపోయిన మావోయిస్టులకు పోలీస్ శాఖ ఎప్పుడు అండగానే ఉంటుంది.

ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పిస్తాము..

 జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్  

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

ఇటీవల 2023 -24 సంవత్సరంలో జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయన తెలంగాణ, ఆంధ్ర, చతిస్గడ్ సరిహద్దు ప్రాంతంలోని మావోయిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన రివార్డులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా అందజేశారు..నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పని చేస్తూ ఇటీవల కాలంలో జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన ఏడుగురు సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సోమవారం ఎస్పీ కార్యాలయంలో చెక్కు రూపంలో రివార్డు నగదులను అందజేశారు.రివార్డు నగదు పొందిన సభ్యుల వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు .పోడియం మంగు అలియాస్ దేవేందర్,24సంవత్సరాలు, తుమ్రేల్ గ్రామం, పామేడు పోలీస్ స్టేషన్ పరిధి, బీజాపూర్ జిల్లా నకు 4,00,000/- రూపాయలు మడకం అడిమె అలియాస్ అనూష,23 సంవత్సరాలు కొరకట్పాడు గ్రామం,చర్ల మండలం 4,00,000/- రూపాయలు 

కోరం సోమయ్య అలియాస్ సోమ, 20సంవత్సరాలు , గొల్ల గుప్ప గ్రామం,ఎటపాక, అల్లూరి సీతారామరాజు జిల్లా,ఆంధ్రప్రదేశ్. 1,00,000/-(లక్ష రూపాయలు) 

సొడ్డి పొజ్జి అలియాస్ చిలుక, 25 సంవత్సరాలు, డోకుపాడు గ్రామం, కిష్టారం పిఎస్,సుకుమా జిల్లా 4,00,000/- రూపాయలు .మడివి సోమిడి అలియాస్ రమ్య, 22 సంవత్సరాలు, డోకుపాడు గ్రామం కిష్టారం పిఎస్,సుకుమా జిల్లా 4,00,000/- రూపాయలు మడకం ఇడుమయ్య అలియాస్ మహేష్, 22సంవత్సరాలు , అడవిరామారం గ్రామం ఆళ్లపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 1,00,000/-(లక్ష రూపాయలు) వ్యక్తి లక్ష్మయ్య అలియాస్ కల్లు 22సంవత్సరాలు, కిష్టారంపాడు గ్రామం,చర్ల మండలం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. 1,00,000/-(లక్ష రూపాయలు)...ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ 2023-2024 సంవత్సరాల కాలంలో లొంగిపోయిన 26 మంది సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం నుండి మంజూరైన రివార్డు నగదులను వారి పునరావాసం కోసం అందజేయడం జరిగిందని తెలియజేసారు.కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు అమాయకులైన ఆదివాసీలను బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకుంటూ వారి చేత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు.

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన నాయకులు మరియు సభ్యులు ఆయుధాలను వీడి ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల హక్కుల తరుపున పోరాడాలని కోరారు.లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునేవారు తమ బంధుమిత్రుల ద్వారా గానీ, స్థానిక పోలీస్ అధికారుల ద్వారా గానీ లేదా స్వయంగా జిల్లా ఎస్పీ గారి ఎదుట గాని లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు.లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా పోలీస్ శాఖ తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,దుమ్ముగూడెం సిఐ అశోక్ మరియు చర్ల సీఐ రాజువర్మ లు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది