ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:
తెలంగాణలో సైబర్, డ్రగ్స్ రూపంలో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. యవతకు సైబర్ క్రైమ్ విభాగంలో శిక్షణ ఇవ్వాలని డీజీపీని కోరుతున్నట్లు తెలిపారు. కఠిన చర్యలు చేపట్టి గంజాయి, డ్రగ్స్ను అరికడుతున్నామని చెప్పారు. డ్రగ్స్ కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 6 నెలల్లోగా తీర్పులు వచ్చేలా చూస్తామని ప్రకటించారు. రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావులేకుండా పాలన అందిస్తున్నట్లు తెలిపారు.
إرسال تعليق