పదేళ్లలో రెండవసారి భూకంపం అక్కడే?

 


భద్రాచలం : భద్రాచలంలో పదేళ్లలో రెండవసారి భూకంపం రావడం గమనార్హం. ఈ రోజు ఉదయం 7.27 నిమిషాలకు దాదాపు మూడు సెకండ్ల పాటు భూమి కంపించిన విషయం తెలిసిందే. స్థానికంగా భూకంపం తీవ్ర చర్చనీయాంశం అయింది. కొందరు తాము తూగినట్లు, ఇంట్లో సామాన్లు కదిలినట్లు తాము చూసిన విషయం తెలుపుతున్నారు. కొంతమంది ఇళ్లలోంచి బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సీసీ కెమెరాలు సైతం ఊగటంతో... భూకంపం విషయం ప్రత్యక్షంగా వెలుగు చూసింది. బహుశా 2017 లో కూడా రాత్రి 10 గంటల సమయంలో భూకంపం సంభవించిన విషయం విధితమే. అప్పుడు కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఏదేమైనా భూకంపాలు. ఈ ప్రాంతాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి.

Post a Comment

أحدث أقدم