ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన మడికొండ పోలీసులు
శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా పోలీసులు తీసుకుంటున్న ముందస్తూ చర్యల్లో భాగంగా మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు మడికొండ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కిషన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడినా, ఎలాంటి నేరాల్లో పాల్గొన్నా.. కఠినంగా చర్యలు తీసుకుంటామని రౌడీ షీటర్లను ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి