*24గంటల్లో మోహన్ బాబును అరెస్ట్ చేయకపోతే తన ఇంటిని ముట్టడిస్తాం*
-: భద్రాచలం జర్నలిస్టుల జేఏసి
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాద్ నగరంలో టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని భద్రాచలం జర్నలిస్టుల జేఏసీ అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే భద్రాచలం జర్నలిస్టుల జేఏసి అధ్వర్యంలో మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తామని భద్రాచలం జర్నలిస్ట్ జేఏసి హెచ్చరించింది. పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నినాదాలు చేసి నిరసన తెలిపి ఆర్డీవో దామోదర్ కు మెమోరాండం అందించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం జర్నలిస్టుల జేఏసి నాయకులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి