*ప్రైవేట్ పాఠశాల డ్రైవర్లకు క్లీనర్లకు చట్టబద్ధ హక్కులు అమలు చేస్తాం*
మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
*కార్మిక శాఖ అధికారి నాగరాజు మధ్యవర్తిత్వంలో ప్రవేటు పాఠశాలలతో కుదిరిన ఒప్పందం*
*ప్రవేట్ పాఠశాల డ్రైవర్లు క్లీనర్లు హర్షం*
మణుగూరు మండలంలో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లకు క్లీనర్లకు ఛట్టబద్ధమైన హక్కులను అమలు చేస్తామని మణుగూరు కార్మిక శాఖ అధికారి నాగరాజు గారు తెలిపారు.మణుగూరు కు చెందిన ప్రముఖ సామాజిక సేవకులు కర్నే బాబురావు ఫిర్యాదు మేరకు ఆయన ఈరోజు హామీ ఇచ్చారు. ఈ మేరకు లేబర్ ఇనస్పెక్టర్ ఎన్. నాగరాజు గారు బుధవారం శివలింగాపురంలోని కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవింద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారి తో కార్మిక శాఖ అధికారి నాగరాజు గారి చొరవతో సామరస్య వాతావరణంలో చర్చలు జరిగాయి. ఒప్పందపు వివరాలు ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లకు మరియు క్లీనర్లకు సంవత్సరానికి రెండు జతల కాకి యూనిఫామ్, వారాంతపు సెలవు, నెలకు రెండు లీవులు, కార్మిక శాఖ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ జీవో అమలు చేస్తాం,పిఎఫ్ అమలు, 15 రోజుల గడువు లోపల అమలు చేస్తామని హామీ ఇచ్చారని బాబురావు విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారి నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు. తమ చట్టబద్ధ హక్కుల కోసం ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై ఒత్తిడి చేసి తమకు న్యాయం చేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావును ప్రైవేట్ స్కూల్స్ డ్రైవర్లు, క్లీనర్లు ధన్యవాదాలు తెలిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి