క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత
వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణ
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
క్రీడలలో రాణించేలా క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వంఅధిక ప్రాధాన్యత ఇస్తుందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం హనుమకొండ జేఎన్ఎస్ లో చీఫ్ మినిస్టర్స్ కప్ -2024 జిల్లా స్థాయి పోటీలను ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవ ప్రారంభించారు .ఈ కార్యక్రమానికి వరంగల్ నగరఆమె మాట్లాడుతూ మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి క్రీడలను నిర్వహిస్తుందన్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర బడ్జెట్లో రూ. 375 కోట్లను ప్రభుత్వం కేటాయించారని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు అనేవి సహజమని అన్నారు. క్రీడల్లో పాల్గొని స్ఫూర్తిని చాటాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండి అజీజ్ ఖాన్, జిల్లా యువజన క్రీడా అధికారి అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి