రైతులకు న్యాయం చేస్తాం మంత్రి పొంగులేటి.....
పినపాక: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామప్రజలు తరతరాలుగా సాగుచేసుకుంటున్న పేద సన్న కారు రైతుల వద్ద నుండి నవోదయ స్కూల్ నిర్మాణం పేరుతో 126.07 ఎకరాల భూమిని అక్రమించుకుంటున్నట్లు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఇది ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని శనివారం తిరుమలయపాలెం లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని గోపలరావుపేట రైతులు కలిసి తమ గోడును వినిపించారు. మూడు తరాలుగా సాగుచేసుకుంటున్న మా వ్యవసాయ భూమిలో ఎప్పుడు లేనిది ఇప్పుడు వచ్చి ప్రభుత్వ భూమి అని అందులో అడుగుపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మా భూమిని కోల్పోతే 150 మంది రైతులకు జీవనాధారం లేకుండా రోడ్డున పడతామని మమ్మల్ని మీరే కాపాడాలని తమ గోడును వెలిబుచ్చారు.సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి